ఫైల్‌ఫోటో
సాక్షి, హైదరాబాద్: ఈఎస్‌ఐ కుంభకోణంలో దేవికారాణి అక్రమాలు తవ్వినకొద్దీ బయటపడుతున్నాయి. తాజాగా మరో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అమిని కంపెనీ ప్రతినిధులతో కలిసి భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్లుగా ఏసీబీ గుర్తించింది. అమిని కంపెనీ చైర్మన్ శ్రీహరిబాబుకు సంబంధించిన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. 99 కోట్ల రూపాయలతో షేర్‌తో పాటు, 30 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను ఏసీబీ గుర్తించింది. శ్రీహరి బాబును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఈఎస్‌ఐ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికా రాణిపై మనీ లాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది. అధికారంలో ఉండగా ఆమె పెద్ద మొత్తంలో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లుగా ఈడీ పక్కా ఆధారాలు సేకరించింది. ఇప్పటికే దేవికా రాణిపై మూడు కేసులు ఏసీబీ నమోదు చేసింది. దేవికారాణి భర్తపై కూడా ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దాదాపు రెండు వందల కోట్ల వరకు స్కామ్ జరిగినట్లు ఏసీబీ గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment