
సాక్షి, గుత్తి: ఓ ఆటో డ్రైవర్ మానవత్వం మరచిపోయాడు. తెలిసిన వ్యక్తి కదా అని అతని బైక్ ఎక్కింది. కానీ ఆ ఆటో డ్రైవర్ పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని తురకపల్లిలో చోటుచేసుకుంది. వివరాలివి.. గ్రామానికి చెందిన బాలిక గుత్తిలోని మోడల్ స్కూల్లో పదవ తరగతి చదవుతోంది. రోజూ అదే గ్రామానికి చెందిన ఆటోలో స్కూల్కు వెళ్లి వస్తోంది. ఆటో డ్రైవర్ మహేష్(31) ఆ బాలికతో చనువుగా మెలుగుతున్న విషయం తల్లిదండ్రలు తెలుసుకున్నారు.
వారు కుమార్తెను మరో ఆటోలో పాఠశాలకు పంపుతున్నారు. గత నెల 28వ తేదీన బాలిక పాఠశాలకకు నడుచుకుంటూ వెళ్తోంది. గుంతకల్ రోడ్డులో వెళ్లుతున్న సమయంలో ఆటో డ్రైవర్ మహేష్ బైక్పై వచ్చి తాను కూడా స్కూల్ వద్దకు పోతున్నానని, అక్కడ వదిలిపెడతానని నమ్మబలికాడు. తెలిసిన వ్యక్తి కావడంతో ఆ విద్యార్థి బైక్పై ఎక్కింది. అయితే అతను పాఠశాలకు వెళ్లకుండా తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని పోదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారం చేసి విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
ఆ రోజు నుంచి విద్యార్థిని ముభావంగా ఉంటోంది. తల్లిదండ్రులు ఎంత ప్రశ్నించినా మౌనమే సమాధానమైంది. బాలిక బుధవారం సొమ్మసిల్లి పడిపోవడంతో ఏం జరిగిందని గట్టిగా నిలదీశారు. దీంతో జరిగిన విషయాన్ని వెల్లడించింది. ఆ మేరకు బాలిక తల్లిదండ్రులు గుత్తి ఎస్ఐ వలిబాషకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలకను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment