బెజ్జంకి పోలీస్‌ భేష్‌.. | Bejjanki Police Station Listed In Nation Best Police Stations | Sakshi
Sakshi News home page

బెజ్జంకి పోలీస్‌ భేష్‌..

Published Fri, Jun 28 2019 12:58 PM | Last Updated on Fri, Jun 28 2019 12:59 PM

Bejjanki Police Station Listed In Nation Best Police Stations - Sakshi

బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌

సాక్షి, బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి పోలీసులు అందిస్తున్న సేవలు, విధులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన అత్యుత్తమ పోలీస్‌ స్టేషన్‌ల జాబితాలో బెజ్జంకి పోలీస్‌ స్టేషన్‌కు 41వ స్థానం లభించినందుకు బెజ్జంకి పోలీసులు, మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో 86 పోలీస్‌స్టేషన్‌లను పరిగణలోకి తీసుకున్న వాటిలో మెరుగైన ఫలితాలు సాధించిన బెజ్జంకి పోలీసులు రానించడం అబినందనీయం.  

శిక్షణలో 53మంది ఎంపిక..
జిల్లా సీపీ జోయల్‌ డేవిస్‌ సూచనలతో ఎస్‌ఐ అభిలాష్‌ మండలంలో గ్రామ గ్రామాన ప్రజలతో కలిసి పనిచేశారు. వాహనదారులకు లైసన్స్‌లను ఇప్పించడంతో పాటు పోలీస్‌ శాఖలో ఉద్యోగాల కోసం యువతను చైతన్య పరిచి ఎక్కువ సంఖ్యలో పోలీస్‌ శాఖలో దరఖాస్తు చేసుకునేలా చేశారు. వారికి శిక్షణ ఇచ్చి 53 మంది ఎంపికయ్యేలా కృషిచేశారు. ప్రస్తుతం వారికి సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్‌ జరుగుతుంది  

ప్రజలతో మమేకమవుతున్నారు.. 
ఇటీవల మండలంలో ఎస్‌సీ, ఎస్‌టీ అట్రసిటీ కేసులు, క్రైంరేటు, తగ్గించడంతో పాటు మండల స్థాయిలో సీసీ కెమెరాలను బిగించడం, సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లో మమేకమై ఉండటంతో మంచి ఫలితాలు వచ్చాయి. సీసీటీఎన్‌ఎస్‌ ఆన్‌లైన్, ఎఫ్‌ఐఆర్‌ల నమోదులోను బెజ్జంకి పోలీసులు ముందున్నారు.

వీటిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర కమిటీ బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌ను అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌ల జాబితాలో చోటిచ్చింది. రాష్ట్రంలోనే మూడు పోలీస్‌స్టేషన్‌లు కేంద్ర జాబితాలో ఉండగా సీఎం కేసీఆర్‌ జిలా, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండలమైన సిద్దిపేటలోని బెజ్జంకి పోలీస్‌ స్టేషన్‌కు 41వ స్థానం లబించినందుకు మండల ప్రజాప్రతినిధులు. ప్రజలు అభినందిస్తున్నారు. 

 సంతోషంగా ఉంది 
జాతీయ స్థాయి ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌లో బెజ్జంకి పోలీస్‌ స్టేషన్‌ 41వ స్థానం లభించడం సంతోషంగా ఉంది. సిద్దిపేట సీపీ జోయల్‌డేవిస్, జిల్లా అధికారులు, మాపోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది సహకారంతో ఈ ఫలితాలు సాధించాం. పలు చోరీ కేసులను వేగంగా చేధించాము. ప్రజలకు సేవలందిస్తు వారిలో మమేకమై పని చేస్తున్న మాసిబ్బంది చాలా సంతోషంగా ఉన్నారు.               – పుల్ల అభిలాష్, ఎస్‌ఐ బెజ్జంకి  

 పోలీసుల కృషికి ఫలితం
బెజ్జంకి ఎస్‌ఐ అభిలాష్‌ నేతృత్వంలో పోలీస్‌ సిబ్బంది మండలంలో చురకుగా పని చేస్తున్నారు. ప్రజల్లో మమేకమై బాదితులకు సహాయం అందిస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాలో మండలంలో ఎలాంటి అవాంతర సంఘటనలు జరకుండా అప్రమత్తంగా చూస్తున్నారు. వీరు చేసిన కృషికి కేంద్ర హోంశాఖ నిర్వహించిన అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌లలో 41వ స్థానం లభించడం అభినందనీయం.          

                                                        – లింగాల నిర్మల లక్ష్మణ్, నూతన ఎంపీపీ, బెజ్జంకి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement