
పశ్చిమబెంగాల్ : కోల్‌కతాలో బాంబు పేలుడు సోమవారం కలకలం రేపింది. కోల్‌కతాలోని కంటోన్మెంట్ రైల్వే లైన్ ఏరియాలో జరిగిన బాంబు పేలుడుతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలంలో మరో 10 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క సారిగా బాంబు పేలడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా బాంబు పేలుడుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.