
కృష్ణరాజపురం : వైద్యుల నిర్లక్ష్యంతో తమ మూడేళ్ల కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ దంపతులు ప్రైవేటు ఆసుపత్రి ఎదుట నిరసన చేసిన ఘటన సోమవారం మారతహళ్లిలో చోటు చేసుకుంది. మారతహళ్లిలో నివాసముంటున్న రవి, సుజాత దంపతులు తమ కుమారుడు ప్రీతమ్ (3) ఫుడ్ పాయిజన్ కావడంతో కొద్ది రోజుల క్రితం మారతహళ్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రీతమ్‌కు చికిత్స చేసిన వైద్యులు అదేరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే మరోసారి మరోసారి ప్రీతమ్ అస్వస్థతకు గురి కావడంతో మూడు రోజుల క్రితం తల్లితండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. మూడు రోజులుగా చికిత్స పొందుతున్న ప్రీతమ్ సోమవారం చికిత్స ఫలించక మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే తమ కుమారుడిని ప్రాణం తీసిందని ఆరోపిస్తూ ప్రీతమ్ తల్లితండ్రులు ఆసుపత్రి ఎదుట నిరసన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment