![Boy Friend Killed Woman in Midnight - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/28/woman-murder.jpg.webp?itok=38s7e0vD)
సంఘటన ప్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ శ్రీరామ్
ఇందిరానగర్ కాలనీని (అర్ధవీడు): మద్యం మత్తులో ఉన్న ప్రియుడి చేతిలో మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన మండలంలోని ఇందిరానగర్ చెంచు కాలనీలో మంగళవారం తెల్లవారు జామున జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన మండ్లా వెంకటమ్మ (50)తో ఉచ్చులూరికట్ట నాగులు సహజీవనం చేస్తున్నాడు. మద్యం మత్తులో ఇద్దరూ ఘర్షణ పడ్డారు. తీవ్ర ఆగ్రహంతో వెంకటమ్మను నాగులు కర్రతో బలంగా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు పరారాయ్యడు. వెంకటమ్మకు మొదటి భర్త మృతి చెందడంతో ఆరేళ్ల నుంచి నాగులుతో సహజీవనం చేస్తోంది. సోమవారం శ్రీరామనవమి పండగ సందర్భంగా కాలనీలో మద్యం తాగారు. అర్ధరాత్రి వరకూ ఇద్దరూ ఘర్షణ పడ్డాడు. ఆ తర్వాత ఆమె హత్యకు గురైంది. గిద్దలూరు సీఐ శ్రీరామ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment