మృతదేహం వద్ద కుటుంబీకులు (ఇన్‌సెట్) వెంకటకృష్ణ (ఫైల్)
చండ్రుగొండ: మండలంలోని దామరచర్లలో ఓ యువకుడిని దుండగులు చంపి, గ్రామ శివారులోని పంట చేల మధ్యలో పడేశారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు... దామరచర్ల గ్రామ యువకుడు జోగు వెంకటకృష్ణ(22), సోమవారం వేకువజామున ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మరుసటి రోజున (మంగళవారం) ఉదయం, గ్రామ శివారులోని రామక్కబంజర్ వెళ్ల మార్గంలోగల పంట చేల వద్ద శవమై కనిపించాడు. అతడి శరీరంపై బలమైన గాయాలున్నా యి. ముఖ భాగమంతా రక్తస్రావమైంది. అతడి తండ్రి బీరయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్య స్థలాన్ని అన్నపురెడ్డిపల్లి ఇన్‌చార్జ్ ఎస్‌ఐ శ్రీరాములు శ్రీను, ట్రైనీ ఎస్‌ఐ కె.శ్రీధర్, ఏఎస్‌ఐ రాంబాబు పరిశీలించారు. గ్రామంలో విచారించారు.
వివాహేతర సంబంధమే కారణమా...?
దామరచర్లకు చెందిన బీరయ్య, సరస్వతి దంపతుల కుమారుడైన వెంకటకృష్ణ, కొత్తగూడెం మండలంలోని సింగరేణి బొగ్గు బాయిలో ఔట్‌సోర్స్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రోజూ ఇంటి నుంచి వెళ్లొస్తున్నాడు. దామరచర్లకే చెందిన వివాహితతో ఇతడికి వివాహేతర సంబంధం ఉన్నదన్న ప్రచారం సాగుతోంది. ఖమ్మంలో హమాలీగా పని చేస్తున్న ఆ వివాహిత సోదరుడు, గతంలోనే వెంకటకృష్ణను మందిలించినట్టు సమాచారం. ఆ వివాహిత కూడా మూడు నెలల క్రితం వెంకటకృష్ణపై చండ్రుగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని, గ్రామ–కుల పెద్దలు పంచాయితీ చేసి సర్దిచెప్పారని సమాచారం. ఆ తరువాత కూడా వీరిద్దరి మధ్య సంబంధం కొనసాగిందని గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు. మూడు రోజుల క్రితం ఖమ్మం నుంచి గ్రామానికి ఆమె సోదరుడు వచ్చాడని, వెంకటకృష్ణ హత్య తరువాత నుంచి అతడు కనిపించడం లేదని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment