
పైడికొండల మాణిక్యాలరావు కారును తనిఖీ చేస్తున్న సీఐ మూర్తి, సిబ్బంది
తాడేపల్లిగూడెం : దేవాదాయ శాఖ మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు కారులో బాంబు ఉందన్న సమాచారం శుక్రవారం కలకలం రేగింది. మాణిక్యాలరావు కారులో బాంబు ఉందంటూ కొన్ని టీవీ చానల్స్ ప్రతినిధులకు సమాచారం అందడంతో వారు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్‌తో క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.
అదే సమయంలో అమిత్‌షాపై తెలుగుదేశం నేతల దాడికి నిరసనగా ర్యాలీకి బీజేపీ సమాయత్తం అవుతున్న సమయంలో బాంబు సమాచారం తెలియడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. పట్టణ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్.మూర్తి బాంబు సమాచారం మాణిక్యాలరావుకు తెలిపారు. పట్ణణ ఎస్సై వెంకట రమణ, బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ సిబ్బంది మాణిక్యాలరావు కారుతో పాటు పరిసరాల్లో ఉన్న కార్లను పరిశీలించారు. బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment