సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. | Car Hits Bike, One Person Died in Suryapet Road Accident | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 1 2018 8:37 AM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

Car Hits Bike, One Person Died in Suryapet Road Accident

సాక్షి, సూర్యాపేట : జిల్లాలోని రాయినిగూడెం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలివి.. రాయినిగూడెంకు చెందిన అన్న చెల్లెలు బైక్‌పై ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. యువతి సంఘటన స్థలంలోని మరణించింది. 

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement