భార్య ఉరి.. భయంతో భర్త..! | Case Filed Against Couple Suicide in Nawanshahr | Sakshi
Sakshi News home page

భార్య సూసైడ్.. భయంతో భర్త..!

Published Thu, Apr 5 2018 4:13 PM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM

Case Filed Against Couple Suicide in Nawanshahr - Sakshi

భార్యాభర్తలు రికీ, పూనమ్ ఘాయ్

సాక్షి, అమృత్‌సర్‌ : ఆత్మహత్యాయత్నం చేసిన భార్య మృతిచెందడంతో ఆందోళనకు గురైన భర్త సైతం బలవన్మరణం చెందాడు. పంజాబ్‌లోని నవాన్ షహర్‌ జిల్లాలో దంపతుల ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. నవాన్‌షహర్ నగర పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో షాబాజ్ సింగ్ కథనం ప్రకారం.. భార్యాభర్తలు రికీ(27), పూనమ్ ఘాయ్ (25)లు వాల్మీకి మోహలా నవాన్‌షహర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం భార్య పూనమ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చిన భర్త రికీ ఫ్యాన్‌కు వేలాడుతున్న భార్యను కిందకి దించి ఆస్పత్రికి తరలించాడు. 

ఆమెను పరీక్షించిన డాక్టర్లు పూనమ్ చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ఆందోళనకు గురైన భర్త రికీ.. డబ్బులు తెచ్చి హాస్పిటల్ ఫీజు చెల్లిస్తానంటూ ఇంటికి వెళ్లిపోయాడు. కానీ ఇంటికి వెళ్లిన రికీ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రికీ రాకపోవడంతో పోలీసులకు వైద్యులు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లి చూడగా రికీ అప్పటికే చనిపోయి ఉన్నాడని, అతడు విషం తాగినట్లు గుర్తించినట్లు షాబాజ్ సింగ్ వెల్లడించారు. కపర్తలాలో ఉంటున్న పూనమ్ తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. భార్యాభర్తలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న దానిపై విచారణ చేపట్టినట్లు వివరించారు. వీరి మధ్య ఏం గొడవలు లేకున్నా ఆత్మహత్య చేసుకోవడంతో కేసు మిస్టరీగా మారనుందని పోలీసులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement