మోసపోయిన యువతి ఉమాదేవి
దుగ్గొండి(నర్సంపేట) : ఏటీఎంలో బ్యాలన్స్ చూడాలని నమ్మి సాయం కొరితే అదే అదనుగా భావించిన సదరు వ్యక్తి నగదు డ్రా చేసుకున్న సంఘటన మండల కేంద్రంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. మండలంలోని పీజీ తండాకు చెందిన నునావత్ ఉమాదేవి జాతీయ గ్రామీణ పథకంలో భాగంగా కూలి పనులు చేస్తోంది.
ఈ క్రమంలో ఎస్‌బీఐ దుగ్గొండి బ్యాంకులో తన బ్యాలన్స్ చూసుకోవడానికి వచ్చింది. బ్యాంకు అధికారులు ఉమాదేవిని ఏటీఎంలో బ్యాలన్స్ చూసుకోవాలని సూచించగా పక్కనే ఉన్న ఏటీఎంకు వెళ్లింది. కాగా, ఆమెకు బ్యాలన్స్ చూడటం రాకపోవడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి సాయం కోరింది. కార్డు తీసుకున్న ఆయన ఏటీఎం ఫిన్ నంబర్ అడిగాడు.
ఆమె తన భర్తకు తెలుసు అని చెప్పింది. వెంటనే మరో వ్యక్తి ఫోన్ తీసుకుని భర్త రవికిషొర్‌నాయక్‌కు ఫోన్ చేసింది. ఫిన్‌నంబర్ భర్త ద్వారా తెలుసుకుని సదరు వ్యక్తికి చెప్పింది. వ్యక్తి ఖాతాలో రూ. 5500 ఉన్నాయని చెప్పి ఉమాదేవికి కార్డు ఇచ్చాడు.
దీంతో మహిళ వెళ్లిపోయింది. మరుక్షణమే ఆమె ఖాతానుంచి రూ.5500 డ్రా చేసుకుని వెళ్లాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఆమె బ్యాంకు వద్దకు వచ్చి బోరున విలపించింది. విషయం తెలుసుకున్న ఎస్సై భాస్కర్‌రెడ్డి ఏటీఎం వద్దకు వచ్చి సీసీ పుటేజీలను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment