
లక్నో : తల్లిదండ్రులు అప్పు కట్టలేదన్న కోపంతో రెండున్నరేళ్ల వారి కూతురిని గొంతునులిమి చంపేశాడో వడ్డీ వ్యాపారి. చిన్నారి కను గుడ్లు బయటకు పీకేసి పాశవికంగా హత్యచేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అలీఘర్‌కు చెందిన దంపతులు వడ్డీ వ్యాపారి దగ్గర 10వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అయితే అప్పు తిరిగి చెల్లించటంలో వారు విఫలమయ్యారు. దీంతో ఆగ్రహించిన వడ్డీ వ్యాపారి మరో వ్యక్తితో కలిసి దంపతుల రెండున్నరేళ్ల కుమార్తెను కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆ చిన్నారిని అతి పాశవికంగా గొంతునులిమి చంపేశాడు. అంతటితో ఆగకుండా చిన్నారి కను గుడ్లను బయటకు పీకేశాడు.
రోజులు గడుస్తున్నా కూతురు కనిపించకపోవటంతో ఆ దంపతులు గత నెల 31వ తేదీన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు వడ్డీ వ్యాపారి మీద అనుమానం వచ్చింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించగా.. చేసిన నేరం ఒప్పుకున్నాడు. వడ్డీ వ్యాపారితో పాటు అతడికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment