సాక్షి, హైదరాబాద్: నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ సిగ్మా హాస్పిటల్‌పై కేసు నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన జంగమ్మ అనే మహిళ బుధవారం సిగ్మా హాస్పిటల్ డాక్టర్ వసంతరావు, హాస్పిటల్‌పై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌కు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని గతంలో సిగ్మా హాస్సిటల్ లో ఆపరేషన్ చేయించుకున్నామన్నారు.
అయితే కిడ్నీ స్టోన్స్ కి అపరేషన్ చేసిన తర్వాత.. మరొక సారి వేరొక ప్రదేశంలో ఆపరేషన్ చేసి.. డబ్బుల కోసం హాస్పిటల్ సిబ్బంది కత్తితో బెదిరించారనిఘ ఆమె ఫిర్యాదులో తెలిపింది. అంతే కాకుండా రెండు సార్లు ఇంటికి వచ్చి కొట్టారని పేర్కొంది. ఈ విషయంపై గతంలోనే పోచంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని.. కానీ ఎవరు పట్టించుకోక పోవడంతో సీపీకి మరోసారి ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై స్పందించిన మహేష్ భగవత్ కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరపాలని భువనగిరి డీసీపీకి ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment