
నెల్లూరు, కావలి: దగదర్తి మండల ఎస్‌ఐ విజయ్ శ్రీనివాస్ టీడీపీ నాయకులను సంతోషపెట్టడానికి చేసిన వీరంగంతో చెన్నూరు మద్యం షాపు లైసెన్స్‌దారులు మంగళవారం ఆందోళనకు దిగారు. వివరాల మేరకు. దగదర్తిలోని చెన్నూరు గ్రామంలో మద్యం షాపు ఉంది. ఆ షాపు లైసెన్స్ తీసుకొన్న వారిని ఎస్‌ఐ మంగళవారం దగదర్తి పోలీస్‌స్టేషన్‌కు రమ్మని కబురు పంపారు. దీంతో వారు ఉదయం 10 గంటల నుంచి పోలీస్‌స్టేషన్ వద్దనే ఉన్నారు. కాని ఎస్‌ఐ స్టేషన్‌లో లేరు. ఆయన ఎక్కడ నుంచో తన జీప్‌లో టీడీపీ మండల నాయకుడు తాళ్లూరు సుధాకర్ నాయుడును వెంట పెట్టుకొని 11 గంటల సమయంలో చెన్నూరులోని మద్యం షాపు వద్దకు వెళ్లారు. షాపులో ఉన్న క్యాషియర్‌ను కొట్టి, అతని చేత షాపునకు తాళాలు వేయించి, నేరుగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ తతంగం జరుగుతున్నంత సేపు ఈ టీడీపీ నాయకుడు ఎస్‌ఐ జీప్‌లోనే ఉన్నాడు.
ఈ సమాచారం అందుకొన్న షాపు లైసెన్స్‌దారులు, గ్రామస్తులు పోలీస్‌స్టేషన్ చేరుకొని ఆందోళ దిగారు. ఎస్‌ఐ అకారణంగా క్యాషియర్‌ను కొట్టడం, షాపునకు తాళాలు వేయడం ఏంటని నిలదీశారు. బుచ్చిరెడ్డిపాళెం ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు దృష్టికి మద్యం షాపు లైసెన్స్‌దారులు సమస్యను తీసుకెళ్లారు. దగదర్తి ఎస్‌ఐకు షాపునకు తాళం వేసే అధికారం లేదని, ఆయన అలా ఎందుకు చేశారో తెలుసుకుంటామన్నారు. స్థానికులు ఆందోళన చేస్తు న్న సమాచారం తెలుసుకొన్న బుచ్చిరెడ్డిపాళెం సీఐ సుబ్బారావు హుటాహుటిగా దగర్తికి చేరుకొన్నారు. ఆయన కూడా ఎస్‌ఐ చేసింది తప్పేనని, ఇక నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకొంటాననని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఆందోళనకారులు ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాని కోరడంతో.. పోలీస్ జీప్‌లో కానిస్టేబుళ్లను చెన్నూరు గ్రామానికి పంపి మద్యం షాపు తాళాలు అప్పగించా రు. దీంతో ఆందోళనకారులు నిరసనను విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment