
గ్రామంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఒడిశా, జయపురం: జయపురం సమితిలోని బాట జగన్నాథపూర్ గ్రామంలో మామను చంపిన కోడలి ఉదంతం శుక్రవారం వెలుగుచూసింది. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. కోడలు ఒక ఇనుప రాడ్డుతో మామ చక్రజాని(50)ని మోదగా ఆయన మరణించినట్లు జయపురం సదర్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి హుటాహుటిన గ్రామానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ హత్య ఎలా జరిగింది? ఎందుకు జరిగిందన్న వివరాలు తెలియరాలేదు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు పూర్తయన తరువాత పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. పోస్ట్‌మార్టం కోసం చక్రజాని మృతదేహాన్ని హాస్పిటల్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment