సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో తలెత్తిన ఘర్షణ నేపథ్యంలో తోడబుట్టిన అన్నను తమ్ముడే కత్తితో పొడిచి చంపేశాడు. సికింద్రాబాద్‌లోని గోపాలపురం పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దసరా పండగ కావడంతో అన్నదమ్ములైన సంతోష్, సాయి ఇద్దరూ రెజిమెంటల్ బజార్‌లోని తల్లి వద్దకు వచ్చారు. మద్యంమత్తులో సంతోష్ తల్లిని తిట్టడం.. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆవేశానికి లోనైన తమ్ముడు సాయి తన అన్నను కడుపులో కత్తితో పొడిచాడు. అనంతరం సాయి గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పెంట్ హౌస్‌లో ఈ ఘటన జరగడంతో ఎవ్వరూ గమనించలేదు. పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. మద్యానికి బానిసై తల్లిని తిట్టడంవల్లే అన్నను హత్య చేశానని సాయి పోలీసుల ముందు అంగీకరించాడు.
Comments
Please login to add a commentAdd a comment