హైదరాబాద్ : నోటి దురుసు ఓ యువకుడి హత్యకు దారితీసింది. తమ తల్లిని, చెల్లిని దూషించడం తో తట్టుకోలేక స్నేహితులే అతడిని దారుణంగా హత్య చేశారు. లోతుకుంట రైల్వే ట్రాక్‌పై దసరా పండగపూట ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళితే.... లోతుకుంట, అల్వాల్ ప్రాంతాల కు చెందిన కిరణ్, యోగి, రాజు, వంశీ స్నేహితులు. వీరి లో కొందరు చదువుకుంటుండగా.. మరికొందరు ఖాళీగా తిరుగుతున్నారు. లోతుకుంట నుంచి నాగదేవత టెంపుల్ కు వెళ్లే రైల్వే ట్రాక్‌ను వీరు తమ అడ్డాగా చేసుకొని.. రో జూ అక్కడకు వెళ్లి మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవిస్తుంటారు.ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం నలుగురూ వచ్చారు.
వీరిలో పెద్దవాడైన కిరణ్ (22) మద్యం మత్తులో స్నేహితులు ముగ్గురినీ దూషించడంతో పాటు వారి తల్లి,సోదరీల గురించి అసభ్యంగా మాట్లాడాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ముగ్గురూ కంకర రాళ్లతో కిరణ్‌పై దాడి చేశారు. తప్పించుకొని పారిపోతున్న అతడిని వెంబడించి, బండరాయితో తలపై మోది చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. సోమవారం తెల్లవారుజామున ట్రాక్‌పై శవం పడి ఉందన్న విషయం తెలుసుకున్న తిరుమలగిరి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ప్రాథమిక దర్యాప్తులో లభించిన క్లూ ఆధారంతో నిందితులు యోగి, రాజు, వంశీలను అదుపులోకి తీసుకుని సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. కిరణ్ హత్య విషయం తెలుసుకున్న బంధువులు రైల్వే ట్రాక్ ఆనుకుని ఉన్న యోగి తండ్రి స్క్రాప్ దుకా ణం వద్దకు వెళ్లి గొడవకు దిగారు. ఆ తర్వాత అక్కడ ఉన్న కొన్ని టైర్‌లను కాల్చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత కు దారి తీయడంతో పోలీసులు వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
గంజాయి దందాలో ఆధిపత్యం కోసమే....?
ఈ హత్యకు సంబంధించి మరో కోణం వెలుగులోకి వ చ్చింది. వెంకటాపురానికి చెందిన కిరణ్ గంజాయి వ్యా పారం చేస్తున్నాడని, అయితే, యోగి, రాజు, వంశీల బం ధువు ఒకడు తా జాగా ఇదే దందా ప్రారంభించాడని పో లీసులకు ప్రాథమిక సమాచారం అందింది. వ్యాపారం లో ఆధిపత్య పోరు తలెత్తడంతో అతనే ఈ ముగ్గురితోట పథకం ప్రకారం కిరణ్‌ను చంపించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. అయితే పోలీసులు మా త్రం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించడంలేదు.
మా తల్లి, సోదరీలను దూషించునందుకే..
చాలా రోజులుగా కిరణ్ తమపై ఆధిపత్యం చెలాయించేవాడని, తమ తల్లి, సోదరీలను దూషించేవాడని యోగి, రాజు, వంశీలు పోలీసుల విచారణలో చెప్పినట్టు విశ్వసనీయంగా తె లిసింది. అతనిపై కక్ష పెంచుకొన్న తాము పథకం ప్రకారం ఆదివారం తమ అడ్డాకు పిలిచి.. మత్తు లో ముంచి అనంతరం రాళ్లతో కొట్టి చంపినట్టు వారు వెల్లడించినట్టు సమాచారం.