వివరాలు సేకరిస్తున్న ఇన్‌చార్జి ఎస్పీ సింధూశర్మ, లచ్చవ్వ(ఫైల్)
వేములవాడఅర్బన్: వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలో బుధవారం అర్ధరాత్రి దారుణహత్య జరిగింది. గ్రామానికి చెందిన పండుగ లచ్చవ్వ(75)ను గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి చంపేశారు. పోలీసుల వివరాల ప్రకారం... పండుగ లచ్చవ్వ ముగ్గురు కొడుకులు, ఇద్ద రు కుమార్తెలున్నారు. అందరికీ వివాహాలు అ య్యాయి. పెద్దకొడుకు చంద్రయ్య వేములవాడలో, రెండో కొడుకు గోపాల్ గల్ఫ్ వెళ్లాడు. చిన్న కొడుకు లచ్చయ్య, తల్లి ఒక్కచోట ఉంటున్నారు. కాగా చిన్నకొడుకు కొంతకాలం క్రితం ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు. చిన్నకోడలు.. ల చ్చవ్వ పక్కపక్క ఇండ్లలో ఉంటున్నారు. బుధవారం రాత్రి లచ్చవ్వ నిద్రలోకి వెళ్లింది. అర్ధరాత్రి దాటా క గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు.
మొదట కోడలు ఉంటున్న ఇంటికి గడియపెట్టారు. లచ్చవ్వ నిద్రిస్తున్న గదితలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. గుర్తుతెలియని ఆయుధంతో మొహంపై గట్టిగా మోదారు. కేకలు వినిపించిన లచ్చవ్వ చిన్నకోడలు చుట్టుపక్కలవారిని పిలిచిం ది. వేములవాడలో ఉంటున్న తనబావ చంద్రయ్యకు ఫోన్లో సమాచారం ఇచ్చింది. వారు వచ్చేసరికి లచ్చవ్వ చనిపోయింది. దుండగులు పారిపోయారు.పోలీసులు గురువారం ఉదయం డాగ్‌స్క్వాడ్‌తో ఇంటి పరిసరాలను పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సింధుశర్మ హత్య జరిగిన కోణాన్ని తెలుసుకున్నారు. వేములవాడ డీఎస్పీ వెంకటరమణ, పట్టణ సీఐ వెంకటస్వామి ఉన్నారు. లచ్చవ్వ పెద్దకొడుకు చంద్రయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment