
సాక్షి, హైదరాబాద్ : పోంజీ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటేడ్ కంపెనీపై గతంలోని ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ డైరెక్టర్ రాధే శ్యామ్, బన్సీలాల్‌తోపాటు కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేశారు. పీఎమ్‌ఎల్‌ఏ(ప్రివేన్షన్ ఆఫ్ మనీ లాండరీంగ్) యాక్ట్ ద్వారా మొత్తం 261 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేసి అటాచ్ చేశారు. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో ముఖ్యంగా గృహ నిర్మాణాలు, ప్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment