
ఎరువుల దుకాణం సీసీ కెమెరాలో విజిలెన్స్ అధికారిగా చెప్పుకున్న వ్యక్తి
దామరచర్ల : దామరచర్ల మండలం కొండ్రపోల్ రైతు మిత్ర ఎరువుల దుకాణంలో సోమవారం విజిలెన్స్ అధికారిగా హల్‌చల్ చేసిన వ్యక్తి.. ఈ నెల 23న హయత్ నగర్‌లో సోనీని కిడ్నాప్ చేసిన వ్యక్తి ఒక్కరేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీ ఫార్మసీ విద్యార్థిని సోనీని రవిశంకర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. కిడ్నాపర్ వినియోగించిన లాంటి కారునే విజిలెన్స్ అధికారిగా చెప్పుకున్న వ్యక్తీ వినియోగించాడని సమాచారం. అయితే కారునంబర్‌లో మాత్రం తేడాలున్నట్లు తెలుస్తోంది. ఎరువుల దుకాణం నుంచి నగదుతో ఉడాయించిన సదరు వ్యక్తి రాష్ట్ర సరిహద్దు అయిన వాడపల్లి వంతెన ద్వారా ఏపీలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ఉన్నతాధికారులు అప్రమత్తం చేయడంతో కిడ్నాపర్, విజెలెన్స్ అధికారిగా చెప్పుకున్న వ్యక్తి ఒక్కరేనా? అన్న దిశలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment