
మృతులు(ఫైల్)
సాక్షి, హైదరాబాద్ : ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపింది. ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రదీప్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య స్వాతి, పిల్లలు కళ్యాణ్ కృష్ణ(5), జయకృష్ణ(1.5)లతో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వరకొండ మండలం నెరడుకొమ్మ గ్రామానికి చెందిన వీరు హస్తినాపూర్లోని సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఈ ఆత్మహత్యలకు కారణమని తెలుస్తోంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment