ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్న శివ నాగరాజు కుటుంబం
పెనుగొండ/పెరవలి: అప్పుల బాధ తాళలేక ఓ చిరువ్యాపారి కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు బీసీ కాలనీకి చెందిన బొబ్బిలి శివనాగరాజు (36), భార్య నాగ వరలక్ష్మి (35), కుమార్తెలు చంద్రిక బాల మాణిక్యం(8), అమృత వర్షిణి (9) ఈ సంఘటనలో మృతి చెంది ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సిద్ధాంతం వద్ద ఉభయ గోదావరి జిల్లాలను కలిపే వశిష్టా బ్రిడ్జిపై మోటారు సైకిల్ ఆగిఉండటాన్ని గుర్తించిన హైవే పోలీసులు అనుమానంతో పరిశీలించగా అక్కడ రెండు జతల చెప్పులు, సూసైడ్ నోట్‌ను గుర్తించారు. దీంతో ఆ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావించారు.
విషయం తెలుసుకొన్న రెవెన్యూ సిబ్బంది, పెరవలి, పెనుగొండ పోలీసులు గోదావరి పరీవాహక ప్రాంతంలో విస్తృతంగా గాలించినా చీకటి పడే వరకు ఆ కుటుంబం జాడ దొరకలేదు. సూసైడ్ నోట్‌లో.. తనపేరు బొబ్బిలి నాగ వరలక్ష్మిఅని తాము కానూరు బీసీ కాలనీ నివాసులమని మహిళ పేర్కొంది. తాను ఆర్థికంగా చాలా నలిగిపో యానని, చావు తప్ప మరోదారి లేదని పేర్కొంది. అప్పులు ఇచ్చిన వారు తమను టార్చర్ పెడుతు న్నారని, అందుకే ఈ పని చేస్తున్నామని, తమ చావుకు శ్రీధర్‌రెడ్డి, నాగమణి, మాణిక్యం, అనంతలక్ష్మి కారణమని పేర్కొంది. శివ నాగరాజు తండ్రి నాగేశ్వరరావు సోమవారం రాత్రి పెనుగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడి కుటుంబం పుణ్యస్నానానికి వెళ్లారనుకున్నానని.. ఇలా చేస్తారని ఊహించలేదని ఆయన విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment