కాపురంలో చిచ్చు పెట్టిన  మద్యం   | family suiside attempt... | Sakshi
Sakshi News home page

కాపురంలో చిచ్చు పెట్టిన  మద్యం  

Published Wed, Dec 27 2017 8:16 PM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM

సాక్షి, తుమకూరు:  భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి  ఆత్మహత్యకు యత్నించిన ఘటన బుధవారం జిల్లాలోని శిరా తాలూకాలో చోటుచేసుకుంది. తాలూకాలోని తావరకెరె గ్రామానికి చెందిన నాగేశ్‌ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ భార్య పిల్లలతో కలసి జీవిస్తున్నాడు.

కొద్ది కాలంగా మద్యానికి అలవాటు పడ్డ నాగేశ్‌ భార్య సుహాసినిని మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. సంపాదన మొత్తం తాగుడుకే ఖర్చు చేస్తుండడంతో కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు కూడా చుట్టుముట్టాయి. భర్త తీరుతో విసుగు చెందిన సుహాసిని బుధవారం ఇద్దరు పిల్లలు విద్య(9),భవ్య(5)లకు క్రిమిసంహారక మందు తాగించి తాను కూడా సేవించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పిల్లలిద్దరూ మృతి చెందగా సుహాసిని చావుబ్రతుకుల మధ్య పోరాడుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement