ఇద్దరు కొడుకులతో కలసి హోంగార్డు ఆత్మహత్య  | family suiside in khammam | Sakshi
Sakshi News home page

ఇద్దరు కొడుకులతో కలసి హోంగార్డు ఆత్మహత్య 

Published Sun, Jan 14 2018 12:36 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

family  suiside in khammam - Sakshi

భార్యాపిల్లలతో కాశీవిశ్వనాథ్‌(ఫైల్‌)

ఖమ్మం క్రైం: ఓ హోంగార్డు ఇద్దరు కొడుకులతో కలసి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం వెంకటగిరి గేటు ప్రాంతంలో శనివారం జరిగింది. ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన  కాశీవిశ్వనాథ్‌(38), సరిత దంపతులు కొడుకులు జయంత్‌(13), అజయ్‌(11) కలసి ఖమ్మం జిల్లా కల్లూరులో ఉంటు న్నారు.  కాశీవిశ్వనాథ్‌ గణేశ్‌ సూపర్‌ మార్కెట్‌ నిర్వహిస్తూనే భద్రాద్రి కొత్తగూడెంలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు.  ఈ క్రమంలో సంక్రాంతి పండగకు పిల్లలకు కొత్త బట్టలు కొనిస్తానని చెప్పి ఉదయాన్నే  ఖమ్మం వెళ్లాడు. పిల్లలతో కలిసి తానూ వెంకటగిరి గేటు ప్రాంతంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతికి కుటుంబ, ఆర్థికపరమైన కారణాలేమైనా ఉన్నాయా? అనేది తెలియరావడం లేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement