కోహెడ రూరల్: ఫ్యూజును సరిచేస్తుండగా ఓ రైతు విద్యుత్ స్తంభంపై మృత్యువాత పడ్డాడు. సిద్దిపేట జిల్లా వరికోలు గ్రామానికి చెందిన కొట్టే వీరారెడ్డి (30) సోమవారం సాయంత్రం తన పొలం పనుల్లో ఉండగా ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజ్ సమస్య తలెత్తింది. విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి లైన్‌కు సరఫరా నిలిపివేయించాడు.
వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ ఉన్న స్తంభం పైకి ఎక్కి ఫ్యూజ్‌ను సరి చేస్తుండగా విద్యుత్ సరాఫరా అయ్యింది. దీంతో విద్యుదాఘాతానికి గురైన వీరారెడ్డి స్తంభంపైనే ప్రాణాలొదిలాడు. ఎల్‌సీ తీసుకుని పనులు చేస్తుండగా, విద్యుత్ ఎలా సరఫరా చేస్తారంటూ గ్రామస్తులు మండిపడ్డారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు స్తంభం పై నుంచి మృతదేహన్ని కిందకు దించబోమని భీష్మించారు.
Comments
Please login to add a commentAdd a comment