
మఠంపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రధాన ఆలయానికి ముందున్న సింహద్వారం, ఆంజనేయస్వామి ఆలయం మధ్య వేసిన గుడారంలో షార్ట్ సర్క్యూట్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
భయాందోళనతో అర్చకులు, భక్తులు పరుగులు తీశారు. టెంట్లు, షామియానాలు పూర్తిగా కాలిపోయాయి. ఫర్నిచర్, గదులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటర్ ట్యాంకర్‌ను రప్పించి మంటలను ఆర్పారు.