
హైదరాబాద్: దోపిడీలకు పాల్పడుతోన్న ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు సభ్యుల ఈ ముఠాలో మరో నిందితుడు తప్పించుకు పారిపోయాడు. నిందితుల నుంచి 19 తులాల బంగారు ఆభరణాలు, 1.5 లక్షల నగదు, 10 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీలకు పాల్పడుతోన్న ఈ ముఠా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆమ్రెహ జిల్లా చూచేలకలన్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
నకిలీ ఫోన్ నెంబర్ల సహాయంతో బస్సు టిక్కెట్లు కొనుగోలు చేసి చైన్నై, బెంగుళూరు ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ప్రయాణించడం..ప్రయాణికులు నిద్రపోయాక వారి విలువైన వస్తువులు దొంగిలించడం పనిగా పెట్టుకున్నారని రాచకొండ పోలీసులు తెలిపారు. వీరిపై వనస్థలిపురం పోలీస్టేషన్‌లో ఒకటి, ఎల్బీనగర్ స్టేషన్‌లో3 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment