వివరాలు వెల్లడిస్తున్న సీఐ రాము
మంత్రాలయం రూరల్: బుర్ఖా వేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు మహిళలను మంగళవారం మంత్రాలయం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ డి.రాము, ఎస్‌ఐ శ్రీనివాసనాయక్‌తో కలిసి వివరాలను వెల్లడించారు. కర్ణాటక నుంచి బుర్ఖా వేసుకుని చోరీలు చేసే కొంతమంది మహిళలు మంత్రాలయం వైపు వచ్చారని స్థానిక కానిస్టేబుల్ రంగన్నకు సమాచారం వచ్చింది. విషయాన్ని సీఐ, ఎస్‌ల దృష్టికి తీసుకుపోగా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ఆర్టీసీ బస్టాండ్, తుంగభద్ర నది తీరంలో వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రాయాచూర్‌లోని జహీరాబాద్ కాలనీకి చెందిన హుస్సేన్‌బీ, రహేనా, సుల్తానా, జైతున్‌బీ బుర్ఖాలు ధరించి చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో అంగీకరించారు. వీరిని ఎమ్మిగనూరు జడ్జి వాసుదేవ్ ఎదుట హాజరుపర్చగా రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. దొంగ ముఠా సమాచాకాన్ని సేకరించిన కానిస్టేబుల్ రంగన్నకు సీఐ రివార్డు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment