సాక్షి, బనశంకరి : ప్రేమిస్తున్నట్లు నటించి ఓ యువకుడు, మైనర్ బాలికను కిడ్నాప్‌నకు పాల్పడిన ఘటనపై హెణ్ణూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆలస‍్యంగా వెలుగుచూసిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు...
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ కుటుంబం పదేళ్ల క్రితం నగరానికి చేరుకుని దణిసంద్రలో నివాసముంటోంది. వీరి కుటుంబంలో పదేళ్ల వయసున్ను ఓ బాలిక ఇక్కడి హెణ్ణూరులో 7వ తరగతి చదువుతోంది. బాలిక తండ్రి అపార్టుమెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. వీరి ఇంటి ఎదురుగా ఉంటున్న వినోద్ అనే యువకుడు బాలికతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు వినోద్‌ను హెచ్చరించారు. ఈనెల 2న బాలికను తీసుకుని వినోద్ ఉడాయించాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment