
ప్రతీకాత్మక చిత్రం
ఘజియాబాద్ : ఓ మహిళను ఆమె కూతురు ఇనుప రాడ్‌తో కొట్టి చంపింది. ఈ సంఘటన భారత రాజధాని ఢిల్లీలోని కావీ నగర్ ప్రాంతంలో గత నెల మార్చి 9న జరిగింది. ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. కూతురు మరో మహిళ(తన టీచర్)తో సెక్సువల్ రిలేషన్‌షిప్ కొనసాగిస్తుండటంతో తల్లి మందలించింది. దీంతో కోపం పట్టలేక ఇంట్లో ఉన్న ఇనుప రాడ్‌తో తల్లి పుష్పాదేవి తలపై ఆమె కూతురు బాదడంతో తీవ్రగాయాలపాలైంది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఈ సంఘటన జరిగిన వెంటనే కూతురు రష్మి రానా(21), ఆమె లైంగిక భాగస్వామి నిషాతో పారిపోయింది.
నిందితురాలి తండ్రి సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం రష్మి రానా(21), నిషా గౌతమ్‌లిద్దరినీ ఘజియాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు విషయమై స్థానిక ఎస్పీ ఆకాష్ తోమర్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
‘కొన్ని రోజుల నుంచి రష్మి, నిషా ఇద్దరూ కలిసి ఉంటున్నారు. నిషాను వదిలేందుకు రష్మి సిద్ధపడక పోవడంతో తల్లి పుష్పాదేవి తీవ్రంగా మందలించింది. దీంతో కోపోద్రిక్తురాలైన రష్మి, తన తల్లిని ఐరన్ రాడ్‌తో కొట్టింది. గాయపడిన పుష్పాదేవి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించింది. సంఘటన జరిగిన సమయంలో పుష్పాదేవి భర్త సతీష్ కుమార్ లేరు. విచారణలో నేరాన్ని రష్మి రానా ఒప్పుకున్నార’ని ఎస్పీ వివరించారు. అనంతరం రష్మితో పాటు నిషాను కూడా జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment