
మల్కాజిగిరి: అనారోగ్యంతో ఉన్న వృద్ధురాలికి తోడుగా ఉంటాడని దూరపు బంధువుని ఇంట్లో ఉంచితే (వరుసకు మనువడు) ఆ ఇంటికే కన్నం వేసాడో యువకుడు. మల్కాజిగిరి డివిజన్ డీసీసీ రక్షితా మూర్తి, ఏసీపీ నర్సింహారెడ్డి తెలిపిన మేరకు.. ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడ జయేంద్రనగర్‌కు చెందిన ఈగలపాటి ప్రవీణ్ కుమార్ అలియాస్ పండు(30) తండ్రితో కలిసి రైస్‌మిల్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మౌలాలి ఎస్పీనగర్‌కు చెందిన బీఎస్‌ఎన్‌ఎల్ విశ్రాంత ఉద్యోగి దొరైస్వామి వృద్ధురాలైన తన పిన్ని సరస్వతికి ఆరోగ్యం బాగాలేపోవడంతో బంధువైన ప్రవీణ్‌కుమార్‌ను తీసుకొని వచ్చి కేర్‌కేటర్‌గా ఏర్పాటు చేశాడు. దొరైస్వామి కుమారుడి వివాహం వచ్చే నెల 7వ తేదీ ఉండడంతో పెండ్లి పత్రికలు పంచేసమయంలో ఆయన భార్య విజయలక్ష్మి తన బంగారు నగలను సరస్వతి వద్ద ఉంచింది.
వ్యవనాలకు అలవాటైన ప్రవీణ్‌కుమార్ వృద్ధురాలి ఇంట్లో బంగారు ఉండడాన్ని గమనించాడు. సుమారు 14 తులాలు కాజేసి ఊరికి వెళ్లి తిరిగి వచ్చి ఏమి తెలియనట్లు పనిచేస్తున్నాడు. ఈ నెల 16న సరస్వతి వద్దకు వెళ్లి నగలు తీసుకోవాలని బీరువాలో చూస్తే నగలు కనిపించలేదు. ఈ సంఘటన పై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు గురువారం ఎస్పీనగర్‌లో ప్రవీణ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద 10.7 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఆభరాణాల గురించి దర్యాప్తు చేస్తున్నామని డీసీసీ, ఏసీపీలు తెలిపారు. కేసు తొందరగా ఛేదించిన ఇన్‌స్పెక్టర్ మన్మోహన్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్, పోలీస్‌కానిస్టేబుల్స్ రాఘవేంద్ర, శ్రీధర్,కుమారస్వామిలను డీసీసీ,ఏసీపీలు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment