
సాక్షి, కరీంనగర్ : లక్ష్మీపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గ్రామానికి చెందిన ఓ యువకుడు కారు ప్రమాదంలో మృతి చెందటం ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. మానుకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కాల్వ సందీప్ అనే యువకుడు శుక్రవారం అలుగునూర్ వద్ద కారు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మృతుని కుటుంబసభ్యులు, బంధువులు శవంతో లక్ష్మీపూర్‌లో శనివారం ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా అదుపుతప్పాయి. అయితే నష్టపరిహారం చెల్లించే విధంగా కృషి చేస్తామని పోలీసులు సర్పంచ్‌తో మంతనాలు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment