ఇతడేం తండ్రి.. పాపం చిన్నారి ఎటువెళ్లిందో.. | India-Born Girl, 3, Sent Outside At Night As Punishment By Dad, Missing | Sakshi
Sakshi News home page

పాలు తాగనందుకు చిన్నారికి శిక్ష.. అదృశ్యం

Published Tue, Oct 10 2017 9:58 AM | Last Updated on Tue, Aug 28 2018 7:09 PM

 India-Born Girl, 3, Sent Outside At Night As Punishment By Dad, Missing - Sakshi

ఆస్టిన్‌, టెక్సాస్‌ : డల్లాస్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. పాలు తాగనందుకు మూర్ఖంగా మూడేళ్ల కూతురుకు పనిష్‌మెంట్‌ ఇచ్చిన ఓ తండ్రికి దిగ్బ్రాంతి ఎదురైంది. ఆ పాప కనిపించకుండాపోయింది. పాలు తాగలేదనే కోపంతో భారత సంతికి చెందిన మూడేళ్ల తన కూతురు షెరిన్‌కు వెస్లీ మాథ్యూస్‌ అనే(37) ఓ తండ్రి పనిష్‌మెంట్‌ ఇచ్చాడు. ఆ రాత్రి బయటనే నిల్చోవాలని బయటకు పంపాడు. ఆ తర్వాత పాప కనిపించకుండాపోయింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తర్వాత ఓ బాండ్‌పై విడుదల చేశారు.

దీనిపై మాథ్యూస్‌ స్పందించేందుకు నిరాకరించాడు. అయితే, పోలీసులు నమోదు చేసుకున్న అఫిడవిట్‌ ప్రకారం ఆ పాప పాలు తాగనందుకు శిక్షగా శనివారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో ఇంటికి దూరంగా ఉన్న ఓ చెట్టు వద్ద నిల్చోవాలని ఆదేశించాడు. పదిహేను నిమిషాల తర్వాత చూడగా ఆ పాప కనిపించకుండా పోయింది. చాలా సేపు వెతికిన 5గంటల తర్వాత అతడు పోలీసులకు పాప కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. షెరిన్‌ భారత్‌లో జన్మించింది. మాథ్యూస్‌ కుటుంబం ఆ పాపను దత్తత తీసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement