
షార్జా : పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో భారతీయ దంపతులు హత్యకు గురైన ఘటన దుబాయ్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డబ్బు, నగల కోసమే నిందితుడు వారిద్దరిని హత్య చేసినట్లు తెలుస్తుంది. వివరాలు.. భారత్‌కు చెందిన హిరెన్ అధియా, భార్య విధి అధియాతో కలిసి రెండు సంవత్సరాల క్రితం దుబాయ్‌కు వెళ్లి అరేబియన్ రాంచెస్‌లో నివసిస్తున్నాడు. షార్జాలో వ్యాపారం నిర్వహిస్తున్న హిరెన్ వ్యాపార నిమిత్తం జూన్ 18న యూఏఈకి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి హిరెన్, అతని భార్య విధి అధియా నుంచి డబ్బు, నగలు దోచుకొని హత్య చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హత్య చేసిన నిందితుడిని పట్టుకొని అతని వద్ద నుంచి నగలు, సొమ్మును రికవరీ చేశారు. కాగా హిరెన్ దంపతుల హత్యకు సంబంధించి దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్‌లో సమాచారమందించారు. (మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అనుచరుడి అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment