
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి : ప్రేమ పేరుతో మోస పోయానని మనస్థాపం చెందిన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ఘటన జయశంకర్ జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామానికి చెందిన బోడ సింధుజా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన కొండ బత్తుల రమేష్ అనే యువకుడు ప్రేమ పేరుతో సింధుజాను మోసం చేశాడు.
దీంతో మనస్థాపం చెందిన సింధుజా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో విగతజీవిగా పడిఉన్న కూతుర్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కూతుర్ని మోసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ పార్థివ దేహంతో యువకుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిందితుడు పరారిలో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment