
ముంబై: నగరంలోని కమలా మిల్స్ భవనంలోని వన్ అబోవ్ పబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణం అదే భవనంలోని మరో పబ్ నుంచి ఎగసిపడిన నిప్పు రవ్వలేనని అగ్నిమాపక శాఖ శుక్రవారం నాటి తన నివేదికలో పేర్కొంది. కమలా మిల్స్‌లోనే మోజోస్ బిస్త్రో అనే పబ్‌లో అక్రమంగా హుక్కా కేంద్రం నిర్వహిస్తున్నారనీ, అక్కడే నిప్పురవ్వలు ఎగసి మంటలు ప్రారంభమయ్యాయని అగ్నిమాపక శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో పోలీసులు మోజోస్ బిస్త్రో పబ్ యజమానులపై కూడా కేసు లు నమోదు చేశారు. యజమానుల్లో ఒకరైన మాజీ ఐపీఎస్ కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. వీరిపై ‘హత్యగా పరిగణించని, ఇతరుల చావుకు కారణమైన శిక్షార్హమైన నేరం’తోపాటు వివిధ అభియోగాల కింద కేసులు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment