సాక్షి, బెంగళూరు/ బనశంకరి/ రాయచూరు రూరల్: లాక్‌డౌన్ వల్ల మద్యం దొరక్క కొందరు మందుబాబులు తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారు. మైసూరు, దక్షిణ కన్నడ, తుమకూరు, బీదర్, హుబ్లీ జిల్లాల్లో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. లాక్‌డౌన్ వల్ల ఈ నెల 22వ తేదీ నుంచి మద్యం షాపులు, బార్లు మూతపడ్డాయి. నిత్యం తాగుడుకు అలవాటుపడినవారు ఆకస్మాత్తుగా మందు దూరమయ్యేసరికి తట్టుకోలేకపోయారు.
♦ తుమకూరు జిల్లా మధుగిరి తాలుకా చిక్కదాళపట్టె గ్రామంలో హనుమంతప్ప అనే వ్యక్తి గొంతు కోసుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
♦ మైసూరు జిల్లా హుణసూరులో ఓ మందుబాబు లక్ష్మణతీర్థ నదిలోకి దూకి చనిపోయాడు.
♦ బీదర్ జిల్లా భాల్కి పట్టణంలో బావిలో దూకి ఓ హోటల్ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
♦ దక్షిణ కన్నడ జిల్లా కడబ తాలూకా పరిధిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు కడబ పోలీసులు తెలిపారు.
♦ హుబ్లీ హొసూరులోని గణేశ పార్కులో ఉరివేసుకుని ఓ మద్యంప్రియుడు ప్రాణాలు తీసుకున్నాడు.
మత్తు లేని జీవితం వ్యర్థమని..
Published Mon, Mar 30 2020 7:14 AM | Last Updated on Mon, Mar 30 2020 8:49 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment