ప్రేమికుల ఆత్మహత్యాయత్నం | Love Couple Commits Suicide In West Godavari | Sakshi
Sakshi News home page

ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

Published Wed, Jul 11 2018 6:30 AM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Love Couple Commits Suicide In West Godavari - Sakshi

కృష్ణమాధవి (ఫైల్‌), సత్యనారాయణ (ఫైల్‌)

కొవ్వూరు రూరల్‌: అనాలోచిత నిర్ణయం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దలు వివాహానికి అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి ప్రయత్నించడం జిల్లాలో కలకలం రేపింది. సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసిన జంటలో యువతి రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా యువకుడు కోలుకుంటున్నారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం కొవ్వూరు మండలం కుమారదేవానికి చెందిన కొల్లాటి రాజబాబు, ప్రభావతిలకు ముగ్గురు కుమార్తెలు వీరిలో రెండవ కుమార్తె కొల్లాటి కృష్ణమాదవి (17) ఇటీవల ఇంటర్‌ పూర్తి చేసి ఇంటివద్దనే ఉంటుంది. అదే వీధిలో నివాసముంటున్న బోణం సత్యనారాయణతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

సత్యనారాయణ కౌలు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటాడు. అయితే వీరిద్దరిది ఒకే సామాజికవర్గమైనా వీరి వివాహానికి పెద్దలు అభ్యంతరం చెప్పారు. దీంతో సోమవారం రాత్రి పంటపొలాల్లో పురుగు మందు తాగిఆత్మహత్యాయత్నం చేశారు. అనంతరం సత్యనారాయణ కొందరికి తన ఫోన్‌లో సమాచారం ఇవ్వడంతో బంధువులు అక్కడకు చేరుకుని మోటారు సైకిళ్లపై ఇరువురిని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరం తరలించారు. మంగళవారం చికిత్స పొందుతూ కృష్ణమాధవి మృతి చెందింది. సత్యనారాయణ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. దీనిపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement