సాక్షి, బెంగళూరు: ప్రేమించిన యువతి సోదరి అవుతుందని పెద్దలు, పోలీసులు చెప్పినా ఆ యువకుడు పట్టించుకోలేదు. ఆ యువతితోనే తనకు వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తూ పోలీస్‌స్టేషన్ ముందు ధర్నాకు దిగాడు. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్‌కోటే పోలీస్‌స్టేషన్ వద్ద గురువారం చోటుచేసుకుంది. బాగల్‌కోటే తాలూకా నవనగర నివాసి సాగరసుగతేకర అనే యువకుడు ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని గత 12 నెలలుగా ప్రేమిస్తున్నాడు.
ఈ విషయంపై యువతి కుటుంబ సభ్యులు ఆరా తీయగా అతడు అన్న వరుస అవుతాడని గుర్తించి వారి వివాహానికి నిరాకరించారు. అంతేగాక సాగరసుగతేరపై బాగల్‌కోటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువతికి దూరంగా ఉండాలని ఆ యువకుడిని పోలీసులు హెచ్చరించారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని సాగరసుగతేకర గురువారం పోలీస్‌స్టేషన్ ముందు ధర్నాకు దిగాడు. తాను ప్రేమించిన అమ్మాయిని అప్పగించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సాగరసుగతేకరను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment