
సాక్షి, విజయవాడ : నగరంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియురాలు మృతిచెందగా, ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. ఓ ప్రైవేటు కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గౌతమి, లోకేశ్‌లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గాంధీనగర్‌లోని ఓ లాడ్జిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గౌతమి ఘటన స్థలంలోనే మరణించగా, లోకేశ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment