సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో వాహనం నడుపుతూ దొరికిపోయిన ఓ వ్యక్తి నగరంలో హల్‌చల్ చేశాడు. ఆసిఫ్‌నగర్-గుడి మల్కాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మహ్మద్ షఫీ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ దొరికిపోయాడు. తనను పట్టుకోవడంతో అతను పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. కాసేపు మద్యం మత్తులో హల్‌చల్ చేశాడు. చివరికి పోలీసులు అతని వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి.. షఫీని పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment