మృతి చెందిన చీకటి గణేశ్వరరావు
ఆమదాలవలస : శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ లో మంగళవారం రాత్రి రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందారు. జీఆర్‌పీ హెచ్‌సీ ఎం. చిరంజీవిరావు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం పట్టణం బలగకు చెందిన చీకటి గణేశ్వరరావు (48) విజయవాడలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ వెళ్లేందుకు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.
రెండో నంబర్ ప్లాట్‌ఫాం నుంచి మూడో నంబరు ప్లాట్‌ఫామ్ ట్రాకు పైనుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా విశాఖపట్టణం వైపు వెళ్తున్న రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు భార్య విజయలక్ష్మి, కుమార్తెలు అరుణకుమారి, నాగమణి ఉన్నారు. మృతదేహానికి శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment