
చైతన్యపురి : జీతం ఇవ్వమని అడిగినందుకు యజమానికి కోపం వచ్చింది. కట్టె తీసుకుని కొట్టటంతో తలకు తీవ్రగాయం అయి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ డ్రైవర్ తనువు చాలించాడు. చైతన్యపురి పోలీసులు తెలిపిన మేరకు.. మహబూబాబాద్ బావుల్లపెల్లి గ్రామానికి చెందిన సోలాపురం సురేందర్‌రెడ్డి(38) గత కొన్నాళ్ల క్రితం నగరానికి వచ్చి మారుతీనగర్‌కు చెందిన రాచకొండ పరమేష్ దగ్గర మూడు నెలలుగా వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం జీతం డబ్బులు కావాలని సురేందర్‌రెడ్డి ట్యాంకర్ యజమాని పరమేష్‌ను అడిగాడు. దీంతో పరమేష్ కర్ర తీసుకుని కొట్టాడు. కిందపడటంతో తలకు తీవ్రగాయమైంది. హుటాహుటిన కామినేని ఆసుపత్రికి అక్కడ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పరమే‹ష్‌పై పోలీసులు హత్యకేసు నమోదు చేశారు.