అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి | Married Woman Suspicious Death in YSR Kadapa | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి

Dec 15 2018 1:47 PM | Updated on Dec 15 2018 1:47 PM

Married Woman Suspicious Death in YSR Kadapa - Sakshi

కె.రాములమ్మ(ఫైల్‌)

వైఎస్‌ఆర్‌ జిల్లా,ఓబులవారిపల్లె: అనుమనాస్పదస్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన మండలంలోని అడవి శివారు గాదెల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బంధువుల కథనం మేరకు.. కె.రాములమ్మ(25) కడుపునొప్పితో బాధపడుతుండగా తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా వైద్యులు పరిశీలించి విషప్రయోగంతో రాములమ్మ మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఐదేళ్ల క్రితం రాములమ్మకు గాదెల గ్రామానికి చెందిన కె.సుబ్రమణ్యంతో వివాహం చేశారు. వీరికి ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. భర్త సుబ్రమణ్యం ఇటీవలే గల్ఫ్‌దేశానికి వెళ్లాడు. రాములమ్మ గాదెలలో అత్త, ఆడబిడ్డలతో కలిసి ఉంటుంది. ఆడబిడ్డ, అత్త తరచూ గొడవపడుతుండేవారని చుట్టుపక్కలవారు తెలిపారు.

అయితే మూడునెలలుగా బిడ్డ పుట్టిన నాటినుంచి రాములమ్మకు కడుపునొప్పి వస్తుండేదని, ఇటీవలే కొద్దిరోజుల క్రితం కూడా మృతిరాలి తమ్ముడు రైల్వేకోడూరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించాడని తెలిపారు. నెలలు నిండని బిడ్డతో ఉన్న రాములమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా రాములమ్మ ఆత్మహత్య చేసుకునేంత పిరికిదికాదని అత్త, ఆడబిడ్డలు విషప్రయోగం చేసి చంపినట్లు మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేసినట్లు ఎస్‌ఐ మోహన్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి విచారణ చేస్తామన్నారు. అయితే మృతదేహాన్ని సంబంధీకులు గుట్టుచప్పుడు కాకుండా దహనం చేయాలని ప్రయత్నించినట్లు తెలియవచ్చింది. పోలీసులతోపాటు ఇతర అధికారుల పరిశీలన తర్వాతనే ఏదైనా అంత్యక్రియలు చేయాల్సి ఉంది. విషయాలు బయటికి పొక్కుతాయన్న ఆలోచనతో దహనానికి సిద్ధపడినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement