బ్యూటీ పార్లర్‌ పేరుతో క్రాస్‌ మసాజ్‌ | Massage Centre Running With beauty parlour Name In Hyderabad | Sakshi
Sakshi News home page

బ్యూటీ పార్లర్‌ పేరుతో మసాజ్‌ సెంటర్‌

Published Mon, Jul 2 2018 10:33 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Massage Centre Running With beauty parlour Name In Hyderabad - Sakshi

నిందితురాలు రాధమ్మ

గోల్కొండ: బ్యూటీ పార్లర్‌ ముసుగులో క్రాస్‌ మసాజ్‌ నిర్వహిస్తున్న వారిని టాస్క్‌ఫోర్స్‌ సెంట్రల్‌ జోన్‌ టీం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అబిడ్స్‌ చిరాక్‌ గల్లీలో రాధమ్మ అలియాస్‌ జ్యోతి అనే మహిళ ఎస్‌ఎస్‌ న్యాచురల్‌ ఫ్యామిలీ స్పా అండ్‌ సెలూన్‌ పేరుతో బ్యూటీ పార్లర్‌ నిర్వహిస్తోంది. ఈ బ్యూటీ పార్లర్‌కు మహ్మద్‌ ఆరిఫ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు. బ్యూటీ పార్లర్‌ ముసుగులో క్రాస్‌ మసాజ్‌ నిర్వహిస్తున్నట్లు సమా చారం అందడంతో ఆదివారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించి నిర్వాహకురాలు రాధమ్మతో పాటు ఇద్దరు బ్యూటీషియన్లు, మేనేజర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా రాధమ్మ గతంలో నారాయణగూడలో స్లా్పష్‌ బ్యూటీ సెలూన్‌ స్పా ముగుసులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో 2015లో పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement