
సాక్షి, మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలో ఓ బాలిక (10)పై అదే గ్రామానికి చెందిన నస్పూరి శ్రీనివాస్(19) లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం గ్రామంలో పోచమ్మ జాతర జరుగుతుండటంతో ఊరి ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లారు. బాధిత చిన్నారి తల్లిదండ్రులు కూడా జాతరకు వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన పక్కింట్లో ఉండే శ్రీనివాస్, ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి పక్కనే ఖాళీగా ఉన్న ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు.
దీంతో భయపడిన బాలిక ఇంటికి పరుగెత్తింది. విషయం తల్లికి చెప్పింది. దీనిపై శ్రీనివాస్‌ను ప్రశ్నించగా.. అతను అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులకు సమాచా రం అందగా.. వారు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఓంకార్‌యాదవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment