
కృష్ణాజిల్లా, కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ మదాంధుడు అభం శుభం తెలియని ఓ బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లితండ్రులు జరిగిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు నిందితుడిని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మచిలీపట్నం గోపాల్‌నగర్‌కు చెందిన దొండపాటి నాగబాబు అలియాస్ స్వామి పశువులకు పలుపుతాళ్ళు అల్లుతుంటాడు. మిగిలిన సమయాల్లో ఇతర పనులకు వెళ్తుంటాడు. అతను ఎదురింట్లో ఉంటున్న ఏడేళ్ళ బాలికపై కన్నేశాడు.
మంగళవారం బాలిక తల్లితండ్రులు పనులకు వెళ్ళిపోయారు. మూడో తరగతి చదువుతున్న బాలిక స్కూలు నుంచి సాయంత్రం ఇంటికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో విషయం తెలుసుకున్న నాగబాబు బాలికను స్వీట్లు పెడతాను రమ్మంటూ పిలిచాడు. ఇంట్లోకి వెళ్ళగా నాగబాబు అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక దాడికి యత్నించాడు. భయంతో బాలిక పారిపోయింది. మరుసటి రోజు స్కూలుకు రెడీ చేసేందుకు తల్లి స్నానం చేయిస్తుండగా బాలిక చాతి నొప్పితో బాధ పడుతుండటాన్ని గమనించిన తల్లి విషయం అడిగింది. జరిగిన విషయాన్ని బాలిక చెప్పింది. దీంతో బాలిక తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించి నాగబాబుపై ఫిర్యాదు చేశారు. పోలీసులు నాగబాబును అదుపులోకి తీసుకున్నారు. అతనిపై సెక్షన్ 8 ఆఫ్ పోక్సో యాక్టు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల కింద కేసులు నమోదు చేసినట్లు బందరు డీఎస్పీ మహబూబ్‌బాషా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment