
దంపతులు ప్రవీణ్, ప్రియ (ఫైల్)
యశవంతపుర : రెండు నెలల క్రితం వివాహమైన నవ దంపతులు ఆత్మహత్య చేస్తున్న ఘటన కెంగేరి పోలీసుస్టేషన్ పరిధిలో అదివారం రాత్రి జరిగింది. మండ్య జిల్లా చిన్నసంద్రకు చెందిన ప్రవీణ్ (24) బెంగళూరు హనుమంతనగరకు చెందిన ప్రియా (19)లు నవంబర్ 2న ప్రేమ వివాహం చేసుకున్నారు. కెంగేరి మైలసంద్రలో అద్దె ఇంటిలో చాట్ బండార్ వ్యాపారం చేసుకుంటున్నారు. ఆదివారం రాత్రి ప్రియ తల్లి ఇంటికి వచ్చి చూడగా ఇద్దరు ఒకే చీరతో ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించి కేకలు వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment