ప్రముఖ న్యూస్‌ యాంకర్‌ ఆత్మహత్య | News anchor dies after falling from fourth floor | Sakshi
Sakshi News home page

ప్రముఖ న్యూస్‌ యాంకర్‌ ఆత్మహత్య

Published Fri, Dec 14 2018 4:53 PM | Last Updated on Fri, Dec 14 2018 6:07 PM

News anchor dies after falling from fourth floor - Sakshi

ప్రముఖ  న్యూస్‌ యాంకర్‌ రాధికా కౌశిక్  అనుమానాస్పద  మృతి కలకలం  రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ ఘటన చోటు చేసుకుంది.  శుక్రవారం ఉదయం 3.30కి తాను ఉంటున్న బిల్డింగ్‌ నాలుగో అంతస్థు  ఇంటిలోని బాల్కనీలోంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పార్కింగ్‌  ఏరియాలో కౌశిక్‌ మృతదేహాన్ని గమనించిన వాచ్‌మెన్‌ పోలీసులకు సమాచారం అందించారు. అయితే రాధిక ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

వాచ్‌మెన్‌ సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలిని రాధికా కౌశిక్‌గా నిర్ధారించిన అనంతరం ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కీలక అనుమానితుడగా  రాధిక స్నేహితుడు, కో-యాంకర్‌ రాహుల్‌ అవస్థిని అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా రాధిక, రాహుల్‌ ఇద్దరూ మద్యం సేవించారనీ, ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగి ఉంటుందనీ పోలీసులు  భావిస్తున్నారు. అయితే తాను వాష్‌ రూంకి వెళ్లగా రాధిక బాల్కనీనుంచి దూకేసిందని అవస్థి పోలీసుల విచారణలో తెలిపాడు. దీంతో రాధికది హత్మా, ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్‌మార్టం నివేదిక అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని బావిస్తున్నారు.

రాజస్థాన్‌కు చెందిన రాధికా కౌశిక్  స్థానిక న్యూస్ ఛానెల్‌లో రిపోర్టర్‌గా పనిచేసేవారు. ఈ క్రమంలో ఇటీవలే ఆమె నోయిడాకు బదిలీ అయినట్టు తెలుస్తోంది. నాలుగు నెలల క్రితమే రాధిక నోయిడాలో ప్రస్తుతం ఉంటున్న ఇంటిలో చేరినట్టు  సమాచారం. ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement