
నిందితుడి అరెస్టును చూపుతున్న ఇన్‌చార్జి సీఐ రాజయ్య
గార్ల(డోర్నకల్): ఇంటర్ చదువుతున్న ఓ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్న ఓ యువకుడిపై నిర్భయ కేసు నమోదైన సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పోచారం పంచాయతీ ఒండిగుడిసెతండాకు చెందిన భూక్య నరేష్, ఇంటర్ చదువుతున్న ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి గత సెప్టెంబర్ 6న కిడ్నాప్ చేసి హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. కాగా తమ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారని ఆ బాలిక తల్లిదండ్రులు సెప్టెంబర్ 16న ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా మంగళవారం గార్ల రైల్వేస్టేషన్‌లో పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో నిందితుడు భూక్య నరేష్ పోలీసులకు తారసపడ్డాడు. ఈమేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ఇల్లందు కోర్టుకు తరలించినట్లు బయ్యారం ఇన్‌చార్జ్ సీఐ ఎ.రాజయ్య, ఎస్సై.సీహెచ్ వంశీధర్ తెలిపారు. మైనర్ కావడంతో అమ్మాయిని తల్లితండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. నరేష్‌పై నిర్భయ, ఫోక్స్‌యాక్ట్ కింద కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడి అరెస్టును చూపుతున్న ఇన్‌చార్జి సీఐ రాజయ్య
Comments
Please login to add a commentAdd a comment